లాక్ డౌన్ విషయంలో వాలంటీర్ల సేవలు భేష్

లాక్ డౌన్ విషయంలో వాలంటీర్ల సేవలు భేష్, కౌతాళం,మార్చి,27 (అంతిమతీర్పు):-కౌతాళం మండలంలోని   లాక్ డౌన్ విషయంలో కష్టపడుతున్న మండల, గ్రామ వాలంటీర్ల మిత్రులకు మద్దతుగా వారు పనిచేస్తున్న దగ్గరకు వెళ్లి వారిని హృదయపూర్వకంగా మండల వైకాపా నాయకుడు దేశాయి కృష్ణ అభినందించారు.మన  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను మన రాష్ట్రంలో తీసుకురావడం ద్వారా చాలా మంచి పని చేశారని కొనియాడారు.వాలంటీర్లు కూడా తమ శక్తికి మించి ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు అని అదేవిధంగా పోలీసు సిబ్బంది మరియు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారని తెలిపారు.అదేవిధంగా ప్రజలు కూడా అధికారులందరికీ సహకరించికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని  లాక్ డౌన్ విషయంలో సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కులు ధరించి బయట నుండి వచ్చిన ప్రతిసారి చేతులను  శుభ్రంగా కడుక్కోవాలని మనవి చేసారు. అదేవిధంగా మాల వీధిలో ప్రధాన మురికి కాలువ పూడికతీత ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అవతారం , కబ్బెరు లింగన్న , సక్రి తిక్కయ్య , బుజ్జిస్వామి , రామకృష్ణ , బసవరాజు , నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.